కోల్కతా, ఆగస్టు 16: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ముందే అమలు చేస్తుందని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందార్ పేర్కొన్నారు. భారత పౌరసత్వం విషయంలో నిర్ణయాలు తీసుకొనేందుకు రాజ్యాంగం ఈ మేరకు కేంద్రానికి హక్కులు కల్పించిందని మంగళవారం అన్నారు.
రాష్ట్రంలోని అధికార టీఎంసీ, సీఎం మమతా బెనర్జీ సీఏఏను వ్యతిరేకించినా, దాని వలన ఎటువంటి ఫలితం ఉండదన్నారు.