న్యూఢిల్లీ, మే 16 : స్వదేశీ పరిజ్ఞానంతో టాటా కంపెనీ తయారు చేసిన మొదటి సీ295 మిలిటరీ రవాణా విమానాన్ని ఆ సంస్థ వడోదర కేంద్రం నుంచి ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వ సంస్థే కాకుండా భారత ప్రైవేట్ కంపెనీ మిలిటరీ విమానాన్ని తయారు చేయడం రక్షణ రంగంలో కొత్త అధ్యాయం.
ఇప్పటికే రూ. 21,935 కోట్లతో 56 విమానాల తయారీకి సంస్థకు ఆర్డర్ రాగా, 40 విమానాలు సొంతగడ్డపైనే నిర్మితమవుతున్నాయి.