e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News ముంబై జైలు నుంచి రిలీజైన రాజ్‌కుంద్రా..

ముంబై జైలు నుంచి రిలీజైన రాజ్‌కుంద్రా..

ముంబై: పోర్నోగ్ర‌ఫీ కేసులో అరెస్టు అయిన వ్యాపార‌వేత్త రాజ్‌కుంద్రా ఇవాళ ముంబైలోని ఆర్ధ‌ర్ రోడ్డు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. పోర్నోగ్ర‌ఫీ కేసులో నిన్న ముంబై కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరీ చేసిన విష‌యం తెలిసిందే. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అశ్లీల వీడియోల‌ను షూట్ చేసి.. ఓ యాప్ ద్వారా వాటిని అప్‌లోడ్ చేసిన‌ట్లు రాజ్‌కుంద్రాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇవాళ ఉద‌యం 11.30 నిమిషాల‌కు రాజ్‌కుంద్రా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. రెండు నెల‌ల క్రితం ఆయ‌న అరెస్టు అయ్యారు. 50వేల పూచీక‌త్తుపై మెజిస్ట్రేట్ భాజిపాలే ఆయ‌న‌కు బెయిల్ మంజూరీ చేశారు. కుంద్రాతో పాటు అరెస్టు అయిన ర్యాన్ థోర్ప్‌కు కూడా బెయిల్ ఇచ్చారు. సెంట్ర‌ల్ ముంబైలో ఉన్న ఆర్డ‌ర్ రోడ్డు జైలులో రాజ్‌కుంద్రాను జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉంచారు. హాట్‌స్పాట్స్ అనే యాప్ ద్వారా అశ్లీల చిత్రాల‌ను అప్‌లోడ్ చేసిన‌ట్లు కుంద్రాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే తానేమీ పోర్న్ కాంటెంట్‌ను క్రియేట్ చేయ‌లేద‌ని కుంద్రా తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement