న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయిత్ పిలుపు మేరకు ఈ ఉదయం నుంచే రైతులు భారీ సంఖ్యలో పార్లమెంట్ వద్దకు చేరుకుంటున్నారు.
ప్రైవేటు బస్సులు, కార్లతోపాటు ఇతర రవాణా సదుపాయాలను వినియోగించుకుని రైతులు పార్లమెంట్ దగ్గరకు వస్తున్నారు. బీకేయూ నాయకుడు రాకేష్ తికాయిత్ కూడా ఇప్పటికే పార్లమెంట్ ముందు ఆందోళన నిర్వహించతలపెట్టిన ప్రదేశానికి చేరుకున్నారు. మరికాసేపట్లో అందరూ కలిసి పార్లమెంట్ ముందు వ్యవసాయ చట్టాలకు వ్యతికంగా ఆందోళన మొదలు పెట్టనున్నారు.
Delhi: Farmers board a DTC bus near Majnu ka Tila after one of their buses, which they boarded at the Singhu (Delhi-Haryana) border earlier today, broke down pic.twitter.com/OdAHLdtPNi
— ANI (@ANI) July 22, 2021
Buses, carrying farmers, arrive at Jantar Mantar in Delhi. The protesting farmers will agitate against Central Government's three farm laws here. pic.twitter.com/ru3WfYa63p
— ANI (@ANI) July 22, 2021