Delhi Sleeper Bus: ఢిల్లీ బస్సులో గ్యాంగ్ రేప్.. 3 నెలల్లో ఆ బస్సుకు 12 సార్లు జరిమానా
Delhi Sleeper Bus: గ్రేటర్ నోయిడాకు ప్రయాణిస్తున్న 16 ఏళ్ల బాలికపై.. ఢిల్లీలో స్లీపర్ బస్సు డ్రైవర్, కండెక్టర్ గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ బస్సును ఏప్రిల్‌లో రిజిస్టర్ చేశారు. 3 నెలల్లో ఆ బస్సుకు 12 సార్లు ఫైన్ వేశారు. ఆ బస్సుపై మొత్తం 63 వేల ఫైన్ ఉన్నది.
మథుర: ఢిల్లీలో ప్రైవేటు స్లీపర్ బస్సు(Delhi Sleeper Bus)లో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గ్రేటర్ నోయిడాకు ప్రయాణిస్తున్న 16 ఏళ్ల బాలికపై.. స్లీపర్ బస్సు డ్రైవర్, కండెక్టర్ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగింది. అయితే ఆ బస్సును ఏప్రిల్‌లో ఫిరోజాబాద్‌లో రిజిస్టర్ చేశారు. గడిచిన మూడు నెలల్లో ఆ బస్సు 12 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ అంశంలో 12 సార్లు బస్సుకు జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంట్లో యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీదే 9 సార్లు ఉల్లంఘన జరిగినట్లు తెలిపారు. దాదాపు అన్ని సార్లు ఓవర్ స్పీడింగ్ కింద ఫైన్ వేశారు.
నోయిడాలోని సెక్టార్ 63కు వెళ్లేందుకు 16 ఏళ్ల బాలిక UP 83 ET 3789 బస్సు ఎక్కింది. అయితే ఆ బస్సులో అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెను ఢిల్లీలోని కశ్మీర్ గేటు వద్ద నిందితులు వదిలేశారు. కశ్మీర్ గేట్ పోలీసు స్టేషన్లో ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బస్సును సీజ్ చేశారు. డ్రైవర్ కుల్దీప్, కండెక్టర్ సందీప్‌ను అరెస్టు చేశారు. ఆ ఇద్దరూ కాన్పూర్ వాసులే.
స్లీపర్ బస్సుకు మథురలోనే 8 చలాన్లు జారీ అయినట్లు ఏఎస్పీ సురేశ్ చంద్ర రావత్ తెలిపారు. ఆ బస్సు మీద మొత్తం 63వేల ఫైర్ ఉన్నదని పోలీసులు వెల్లడించారు. వరుసగా ఆరు రోజు ఓవర్ స్పీడ్ వల్ల 24 వేల ఫైన్ పడింది. ఓ సారి అక్రమ పార్కింగ్, హైవేపై ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం లాంటి ఫైన్ కూడా ఉన్నది. రిఫ్లెక్టర్ టేప్‌తో పాటు ఇతర అంశాల్లోనూ ఆ బస్సుకు ఫైన్ పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

