Home
National
Bus Driver With Bullet In Arm Drives 30 Km To Save 35 Passengers After Car Chase In Maharashtra
Bus driver | బుల్లెట్ తగిలి రక్తమోడుతున్నా.. 30 కి.మీ. బస్సు నడిపి ప్రయాణికులను రక్షించిన డ్రైవర్
Bus driver | ప్రాణాలకు తెగించి ఒక బస్ డ్రైవర్ చూపిన సాహసం 35 మంది ప్రయాణికులను రక్షించింది. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడినా.. రక్తమోడుతూ అలాగే 30 కిలోమీటర్లు బస్ నడిపి పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
నాగపూర్, మార్చి 12: ప్రాణాలకు తెగించి ఒక బస్ డ్రైవర్ చూపిన సాహసం 35 మంది ప్రయాణికులను రక్షించింది. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడినా.. రక్తమోడుతూ అలాగే 30 కిలోమీటర్లు బస్ నడిపి పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. షెగావ్ నుంచి నాగపూర్‌కు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్‌ను దోపిడీ దొంగలు కారులో వెంబడించారు. నాగపూర్ హైవేపై షెగావ్ వద్ద డ్రైవర్‌పై కాల్పులు జరిపారు.
దాంతో ఒక బుల్లెట్ డ్రైవర్ చేతికి తగిలింది. అయినప్పటికీ ప్రయాణికులను ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతోడ్రైవర్ ఖోమ్‌దేవ్ కవాడె బస్ కంట్రోల్ తప్పకుండా 30 కిలోమీటర్లు పాటు నడిపి దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు ప్రయాణికులను చేర్చాడు. డ్రైవర్ చూపిన సాహసాన్ని పోలీసులు, ప్రయాణికులు అభినందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

