Road Accident : అమర్నాథ్ యాత్రికుల (Amarnath Yatra Pilgrims) తో వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని కాంగ్రా జిల్లా (Kangra district) లో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
జమ్మూ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్లేందుకు యాత్రికులు ఈ ప్రైవేట్ బస్సును అద్దెకు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.