ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరో బీజేపీ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ రద్దు చేయాలని విదేశాల్లో అన్న ఆయన నాలుకను కోయడం బదులు కాల్చాలని అన్నారు. (Burn Rahul’s Tongue) బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండే మాట్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేయడంపై అమెరికాలో మాట్లాడిన రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల రివార్డ్ ఇస్తానని మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఇటీవల ప్రకటించారు. ఇది రాజకీయ వివాదానికి దారి తీసింది.
కాగా, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలపై మహారాష్ట్రకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండే స్పందించారు. రాహుల్ గాంధీ నాలుకను కోసే బదులు కాల్చివేయాలని అన్నారు. మంగళవారం
అమరావతిలో మీడియాతో అనిల్ బోండే మాట్లాడారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ప్రమాదకరమని విమర్శించారు. అయితే నాలుక నరకాలన్న భాష సరికాదని తెలిపారు. ‘ఎవరైనా విదేశాలలో ఏదైనా అసంబద్ధంగా మాట్లాడితే, అతడి నాలుకను కత్తిరించడం కంటే కాల్చి వాతలు పెట్టాలి. అది రాహుల్ గాంధీ, జ్ఞానేష్ మహారావు, శ్యామ్ మానవ్, లేదా బహుజనులు, మెజారిటీ ప్రజల మనోభావాలను గాయపరిచిన ఎవరైనా సరే’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అనిల్ బోండే వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
Mumbai: BJP MP Anil Bonde says, “Instead of chopping off LoP Rahul Gandhi’s tongue, it should be inflicted burns (‘chatka’), as he had gone abroad and allegedly insulted the country” pic.twitter.com/nOpOxWxxOw
— IANS (@ians_india) September 18, 2024