అక్రమ చర్చిలను బుల్డోజర్లతో కూల్చాలి: శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్
బెంగళూరు: మత మార్పిడికి పాల్పడుతున్న అక్రమ చర్చిలను బుల్డోజర్లతో కూల్చాలని కర్ణాటకకు చెందిన శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, వేలాది మంది హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని ఆరోపించారు. దీనికి ఒక్కటే పరిష్కారమని అన్నారు. మత మార్పిడిని ప్రొత్సహించే అక్రమ చర్చిలను కూల్చివేసేందుకు కఠిన చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ చర్చిల జాబితాను తాను బయటపెడతానని, బుల్డోజర్లతో వాటిని కూల్చివేయాలని అన్నారు.
కాగా, మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో అజాన్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఆలయాల్లో హనుమాన్ చాలీసా పఠనానికి శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీరామ్ సేన కార్యకర్తలు ఈ నెల 9న ఉదయం 5 గంటలకు అజాన్‌కు వ్యతిరేకంగా పలు ఆలయాల్లోని లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం సుప్రభాతంతోపాటు భక్తి పాటలను వినిపించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు పలు ప్రాంతాల్లో శ్రీరామ్ సేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

