UP Polls | ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బహుజన్ సమాజ్వాదీ క్రియాశీలకమైంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల బరిలోకి దిగడం లేదని పార్టీ కీలక నేత సతీశ్ చంద్ర మిశ్రా ప్రకటించారు. తాజాగా బీఎస్పీ మరో కీలక ప్రకటన కూడా చేసింది. 10 చిన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటున్నామని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తమ ప్రగతి విధానాలకు పది పార్టీలు ఆకర్షితమయ్యాయని మిశ్రా పేర్కొన్నారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అన్న దృష్టి కోణంతోనే ముందుకెళ్తామని, తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. ఇండియా జనశక్తి పార్టీ, పచ్చాసీ పరివర్తన్ సమాజ్ పార్టీ, విశ్వశాంతి పార్టీ, సంయుక్త జనాదేశ్, ఆదర్శ్ సంగ్రామ్, అఖండ వికాస్ భారత్, సర్వజన ఆవాజ్, ఆధీ ఆబాదీ, జాగరూక్ జనతా, సర్వజన సేవా పార్టీలతో పొత్తుకు ఓకే చెప్పామని మిశ్రా వెల్లడించారు.