ఘాజీపూర్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద ఘాజీపూర్ కోర్టు శనివారం నాలుగేండ్ల శిక్ష విధించింది. ఆయన సోదరుడు ముక్తార్ అన్సారీకి కూడా పదేండ్ల జైలు శిక్ష విధించింది. అఫ్జల్ అన్సారీ ప్రస్తుతం ఘాజీపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం.. చట్టసభ సభ్యుడిగా ఉన్న ఏ వ్యక్తికి అయినా ఏదైనా కేసులో రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే వారి సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుంది.