Mayawati | అతడికి ఇంకా అంత రాజకీయ అనుభవం లేదు.. మేనల్లుడికి పార్టీ బాధ్యతలపై మాయావతి
Mayawati : పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అనుభవం ఇంకా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్కు లేదని, అందువల్ల ఇప్పటికిప్పుడు అతడికి పార్టీ బాధ్యతలు అప్పగించడం లేదని మాయావతి స్పష్టం చేశారు.
Mayawati : తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్కు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించే అంశంపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అనుభవం ఇంకా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్కు లేదని, అందువల్ల ఇప్పటికిప్పుడు అతడికి పార్టీ బాధ్యతలు అప్పగించడం లేదని మాయావతి స్పష్టం చేశారు.
బీఎస్పీకి జాతీయ కార్యవర్గ సమావేశం తాజాగా జరిగింది. ఈ సందర్భంగా తన మేనల్లుడికి బాధ్యతలు అప్పగించే అంశంపై జరుగుతున్న ప్రచారంపై మాయావతి స్పందించారు. నేతలు, కార్యర్తలకు స్పష్టతనిచ్చారు. ‘‘ప్రస్తుతానికి ఆకాష్ ఆనంద్కు పార్టీ కీలక బాధ్యతలు నిర్వర్తించేంత రాజకీయ అనుభవం లేదు. అతడు మరింత రాజకీయ అనుభవం సంపాదించి, విశ్వాసం పొందాలి. అప్పటివరకు ప్రధాన బాధ్యతలు అప్పగించలేను. అయినప్పటికీ, అతడు పార్టీ కోసం స్వేచ్ఛగా పనిచేయవచ్చు’’ అని మాయావతి పేర్కొన్నారు.
నిజానికి కొంతకాలంగా ఆకాష్ ఆనంద్కు పార్టీలో అంత ప్రాధాన్యం లేదు. ఆయన స్థానంపై కూడా సందేహాలున్నాయి. దీంతో తన మేనల్లుడు పార్టీలో కొనసాగవచ్చని ఆమె స్పష్టం చేశారు. అలాగే, కొంతకాలం తర్వాతే ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు దక్కనున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల అంశంపై కూడా మాయావతి మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి వెల్లడించారు. ఏ కూటమిలోనూ ఉండబోదని వివరించారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కాలన్నదే తమ ప్రయత్నం అని మాయవతి లక్ష్యమన్నారు. పంజాబ్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని గతంలోనే మాయావతి ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

