న్యూఢిల్లీ, డిసెంబర్ 26: కూతురి అసభ్య వీడియోను ఆన్లైన్లో పెట్టి వైరల్ చేయడాన్ని ప్రశ్నించిన ఓ సైనికుడిని కొట్టి చంపిన ఘటన గుజరాత్లోని నదియాద్ జిల్లాలో చోటుచేసుకొన్నది. జిల్లాలోని చక్లాసీకి చెందిన ఓ యువకుడు, సైనికుడి కూతురు సన్నిహితంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆమె అసభ్యకర వీడియోను యువకుడు ఆన్లైన్లో పెట్టి వైరల్ చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జవాను.. యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశాడు. దీంతో అతడిపై యువకుడి కుటుంబం దాడి చేసింది. తీవ్ర గాయాలైన ఆయన మృతిచెందారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.