BSF Jawan Arrest | పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారం అందజేస్తున్నాడన్న అభియోగంపై బీఎస్ఎఫ్ జవాన్‌ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు మహ్మద్ సజ్జాద్.. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సరూలా గ్రామ వాసి అని పోలీసులు తెలిపారు.
గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. వాట్సాప్‌లో మెసేజింగ్ ద్వారా పాక్‌కు సున్నితమైన సమాచారం పంపుతున్నాడని మహ్మద్ సజ్జాద్‌పై అభియోగం. బీఎస్ఎఫ్లో చేరడానికి పాకిస్థాన్‌కు వెళ్లిన మహ్మద్ సజ్జాద్.. అక్కడ 46 రోజులు బస చేశాడు.
2011 డిసెంబర్ ఒకటో తేదీన అట్టారీ రైల్వే స్టేషన్ నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో పాకిస్థాన్‌కు వెళ్లాడు. జమ్ములో ఆయన పాస్‌పోర్ట్ రిజిస్టర్ అయి ఉంది. సజ్జాద్ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్న సెల్‌ఫోన్.. అతడి ఆధార్ నంబర్‌పై రిజిస్టరైంది.
కచ్-భుజ్ బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో సజ్జాద్‌ను అరెస్ట్ చేసిన ఏటీఎస్ పోలీసులు అతడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్ సిమ్ కార్డులు, రెండు అదనపు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపైదర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.