బిహార్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ ఫలితాలను విడుదల చేశారు. 80.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను బోర్డు అధికార వెబ్సైట్లో ఉంచుతున్నామని అధికారులు ప్రకటించారు. కామర్స్‌లో 90.38 శాతం, సైన్స్‌లో 79. 85 శాతం, ఆర్ట్స్‌లో 79.53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
అయితే ఈ ఫలితాల్లో ఈ రిక్షా ఆటోడ్రైవర్ కుమారుడు టాపర్‌గా నిలవడం గమనార్హం. సీఎం నితీశ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రచారంలో ఉనన్ సిములతాలా ఆవాసీ విద్యాలయం నుంచి ఈసారి ఒక్కరు కూడా టాపర్‌గా రాలేదు. ప్రతిసారీ ఈ ఆవాస విద్యాలయం నుంచే టాపర్లు వస్తుంటారు. ఈసారి టాప్ 10 లో కూడా ఈ విద్యాలయం నుంచి విద్యార్థులు రాలేదు.