Kangana Ranaut : నటి కృతి సనన్ (Krita Sanan) నటించిన ఓ రాఖీ పండుగ యాడ్ (Rakhi Festival Add) లో ఆమె ధరించిన దుస్తులపై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi).. నటి (Actress), బీజేపీ ఎంపీ (BJP MP) కంగనా రనౌత్ పరస్పర విమర్శలు చేసుకోవడంతో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కృతికి రాహుల్‌గాంధీ మద్దతు తెలుపగా.. కంగనా రనౌత్ ‘వెయిట్ బ్రో (Bro Wait)’ అంటూ కౌంటర్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ నగల బ్రాండ్ రాఖీ పండుగ కోసం రూపొందించిన యాడ్‌లో కృతి సనన్ నటించారు. అందులో ఆమె ధరించిన ఇండో-వెస్ట్రన్ డ్రెస్ పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ “రాఖీ కట్టేటప్పుడు బికినీ, లోదుస్తులు ధరించాల్సిన అవసరం ఏముంది..? ఈ యాడ్ ఉద్దేశపూర్వకంగానే అసహ్యంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఈ విమర్శలపై స్పందించిన కృతి సనన్ “సంస్కృతి, సంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి కానీ, దుస్తుల్లో కాదు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారు..?” అని ప్రశ్నించారు.
ఈ పోస్టును షేర్ చేసిన రాహుల్ గాంధీ.. “ఒక మహిళ ఏం ధరించాలి..? ఎక్కడికి వెళ్లాలి..? అనేది ఆమె ఇష్టం. మహిళ తన స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు ట్రోల్ చేయడం ఆపండి” అని పేర్కొంటూ ‘#SmashThePatriarchy’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. రాహుల్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ చేసిన ఓ పోస్టును షేర్ చేస్తూ.. “బ్రో.. వెయిట్, భారత్ మాతా కీ జై. మొదలు పెడదాం” అని కౌంటర్ ఇచ్చారు.
అంతేగాక ఆ పోస్టులో ట్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్ బిల్లు, షా బానో కేసు, కర్ణాటక కేబినెట్లో మహిళా మంత్రులు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ మహిళల హక్కులపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించించారు. దాంతో ఓ యాడ్‌తో మొదలైన వివాదం కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ విమర్శలకు దారితీసింది.