లండన్: భారతీయ మూలాలుగల శివానీ రాజా (29) బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆమె తాజా ఎన్నికల్లో లెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిని అయిన ఆమె లేబర్ పార్టీ అభ్యర్థి రాజేశ్ అగర్వాల్‌పై గెలుపొందారు. ఆయన కూడా భారతీయ మూలాలు గలవారే.