Britan PM : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మెర్ (Keir Starmer) భారత పర్యటనకు మొదటిసారి రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఆహ్వానాన్ని అంగీకరించిన స్టామెర్ రెండు రోజుల పర్యటన కోసం వచ్చే వారం ఇండియాకు విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 8, అక్టోబర్ 9వ తేదీల్లో స్టార్మెర్, మోడీ సమావేశం అవుతారని.. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారని సమాచారం.
బ్రిటన్ ప్రధాని పర్యటన సందర్భంగా ‘విజన్ 2035’ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. ఈ పదేళ్ల ప్రణాళిక భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రతపరమైన అంశాలకు సంబంధించినది. అంతేకాదు శక్తి, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాల పురోగతి కోసం ఈ విజన్ 2035 ఉపయోగపడనుంది. పర్యటనలో రెండో రోజైన అక్టోబర్ 9న మోడీతో కలిసి స్టార్మెర్ ముంబైలో వ్యాపార, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.
Prime Minister of the United Kingdom #KeirStarmer will be on a two-day visit to India from 8th of October.
This will be Prime Minister Starmer’s first official visit to India. pic.twitter.com/NsVs1CuJ3T
— All India Radio News (@airnewsalerts) October 4, 2025
ఇరుదేశాల మధ్య క్రాంప్రెహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్(CETA)లో ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం అంశాలపై కూడా మోడీ, స్టార్మెర్ మధ్య చర్చ జరిగే అవకాశముంది. అనంతరం .. ఇరువురు ‘గ్లోబల్ ఫిన్‌టెక్’ ఆరో సీజన్ వేడుకలో పాల్గొంటారు. ఈ ఏడాది జూన్‌లో మోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ స్టార్మెర్ను అధికారిక నివాసం ‘చెకెర్స్’లో కలిసిన మోడీ.. 2035 స్ట్రాటజీని ప్రస్తావించారు. ఈ సమయంలోనే భారత్, బ్రిటన్ ప్రతినిధులు మధ్య రక్షణ, పారిశ్రామిక రోడ్‌మ్యాప్‌పై సంతకాలు చేశాయి.