డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చమోలీ జిల్లాలో ఉన్న ఓ బ్రిడ్జ్(Bridge Collapse) కూలిపోయింది. గోవింద్‌ఘాట్, హేమకుండ్ సాహిబ్ మధ్య ఉన్న మోటారు బ్రిడ్జ్ పై కొండ మీద నుంచి బండరాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో ఆ వేలాడే బ్రిడ్జ్ కూలినట్లు అధికారులు చెబుతున్నారు. గోవింద్‌ఘాట్ వద్ద భారీ సైజులో ఉన్న బండరాళ్లు వచ్చి పడడం వల్ల బ్రిడ్జ్ కూలినట్లు నిర్ధారించారు. దీంతో బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమైంది. కొన్ని రోజుల క్రితం బద్రీనాథ్ వద్ద కూడా మంచుచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఆ ఘటనలో బీఆర్వో పనులు చేపడుతున్న కార్మికులు మంచులో చిక్కుకున్నారు. ఆ ప్రమాదంలో సుమారు 6 మంది మరణించారు.
#WATCH | Uttarakhand: The suspension motor bridge connecting Govindghat and Hemkund Sahib in Chamoli district has been completely damaged due to landslide. The bridge collapsed due to the impact of large boulders falling from the hill in front of Govindghat.
(Video Source:… pic.twitter.com/CFHJHuheft
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2025