Uttar Pradesh: కుర్చీ నుంచి కిందపడ్డ వరుడు.. పెళ్లికి నిరాకరించిన వధువు.. హెల్త్ రిపోర్టు ఇవ్వాలని డిమాండ్
Uttar Pradesh: పెళ్లి వేడుక జరుగుతుండగా కుర్చీలో కూర్చున్న వరుడు కిందపడిపోయాడు. దీంతో అతన్ని పెళ్లి చేసుకునేందుకు వధువు నిరాకరించింది. వరుడు హెల్త్ రిపోర్టు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటా జిల్లాలో జరిగింది.
ఇటా: ఉత్తరప్రదేశ్‌లో ఓ వధువు.. వరుడి నుంచి మెడికల్ సర్టిఫికేట్ డిమాండ్ చేసింది. పెళ్లి వేడుక సమయంలో వరుడు కూర్చీ నుంచి కిందపడిపోయాడు. దీంతో అక్కడ హైరానా ఏర్పడింది. కొందరు అతనికి నీళ్లు తాగించారు. కొందరు డాక్టర్ కోసం పరుగులు తీశారు. భారీ ఊరేగింపు నడుమ పెళ్లి వేదికకు వరుడు చేరుకున్న తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నది. అయితే పెళ్లి సంబరాల వేళ వరుడు కుర్చీ నుంచి కిందపడిపోవడం పట్ల వధువు అభ్యంతరం వ్యక్తం చేసింది. వరుడికి ఆరోగ్య పరీక్షలు చేయించాలని పట్టుపట్టింది. హెల్త్ రిపోర్టు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని భీష్మించింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. అయినా ఆ అమ్మాయి వినలేదు. ఇటా జిల్లాలోని కథోని గ్రామానికి చెందిన వరుడు .. సాకిత్ గెస్ట్ హౌజ్ చేరుకున్న తర్వాత ఈ ఘటన జరిగింది. వరుడి ఆరోగ్యంపై వధువు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో పెళ్లి ఆగిపోయింది. వరుడి ఆరోగ్యం గురించి దాచి పెట్టారని వధువు ఫ్యామిలీ ఆరోపించింది. కానీ ఈ ఘటన గురించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

