Bride Of Tamil Nadu | ‘తమిళనాడు పెళ్లికూతురు’ పేరుతో స్టాలిన్ బ్యానర్.. వీడియో వైరల్
Bride Of Tamil Nadu | ‘తమిళనాడు పెళ్లికూతురు’ పేరుతో సీఎం స్టాలిన్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ‘ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’కు బదులుగా ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ (Bride Of Tamil Nadu ) అని తప్పుగా ఆ బ్యానర్లో పేర్కొన్నారు.
చెన్నై: ‘తమిళనాడు పెళ్లికూతురు’ పేరుతో సీఎం స్టాలిన్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ‘ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’కు బదులుగా ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ (Bride Of Tamil Nadu ) అని తప్పుగా ఆ బ్యానర్లో పేర్కొన్నారు. ఈ బ్యానర్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ప్రకటనలు, బ్యానర్లలలో తప్పుల వల్ల తమిళనాడు ప్రభుత్వం వరుసగా నిందలపాలవుతున్నది. ఆ రాష్ట్రంలో ఇస్రో చేపడుతున్న రెండో రాకెట్ లాంచింగ్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి, వార్తా పత్రికల్లో ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో భారత్ రాకెట్‌కు చైనా జెండా ఉండటం వివాదానికి దారి తీసింది.
కాగా, ఇది మరిచిపోకముందే మరో పొరపాటు జరిగింది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ‘తమిళనాడు పెళ్లికూతురు’గా అభివర్ణించింది. ‘ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అనే పదాలతో ఉండాల్సిన బ్యానర్‌ను ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అని తప్పుగా ముద్రించారు. అయినప్పటికీ ఈ బ్యానర్‌ను బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ బ్యానర్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. తమిళనాడు ఇంగ్లీష్ బాగా ఉందని ఒకరు, ‘తమిళనాడు వధువు’ స్టాలిన్ అయితే ‘వరుడు ఎవరు?’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
Oops!
Tamil Nadu's banner blunder turns Stalin into the 'Bride' of the state… instead of 'Pride? 🤑#BannerFail #TamilNadu pic.twitter.com/3ZJSGGjNw4— Nabila Jamal (@nabilajamal_) March 5, 2024
This advertisement by DMK Minister Thiru Anita Radhakrishnan to leading Tamil dailies today is a manifestation of DMK’s commitment to China & their total disregard for our country’s sovereignty.
DMK, a party flighing high on corruption, has been desperate to paste stickers ever… pic.twitter.com/g6CeTzd9TZ
— K.Annamalai (@annamalai_k) February 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

