ప్రభుత్వ బడుల పేర్లలో జాతి, కులం ప్రస్తావనొద్దు
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల పేర్ల నుంచి జాతి లేదా కులం పేర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కల్లకురిచి కల్తీ మద్యం కేసుపై విచారణ సందర్భంగా తనంతట తాను ఈ ఆదేశాలను ఇచ్చింది.
- తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
చెన్నై: తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల పేర్ల నుంచి జాతి లేదా కులం పేర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కల్లకురిచి కల్తీ మద్యం కేసుపై విచారణ సందర్భంగా తనంతట తాను ఈ ఆదేశాలను ఇచ్చింది. కల్వరాయన్ హిల్స్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల పేర్లలో కులం, జాతి పేర్లు ఉంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
‘గవర్నమెంట్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్’ వంటి పేర్లు ఉంటున్నాయని, వీటిలోని ‘ట్రైబల్’ పదాన్ని తొలగించాలని ఆదేశించింది. ఇటువంటి పేర్లు ఉండటం వల్ల ఆ పాఠశాలలో చదివే విద్యార్థులు చులకన భావానికి గురవుతారని తెలిపింది. సమీప ప్రాంతాల్లోని ఇతర పాఠశాలల విద్యార్థులతో సమానంగా కాకుండా, తాము గిరిజన పాఠశాలలో చదువుతున్నామని భావిస్తారని వివరించింది.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో లిథియం నిక్షేపాలు : కేంద్రం
న్యూఢిల్లీ: కర్ణాటకలోని మండ్య, యాదగిరి జిల్లాల్లో లిథియం నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. రాజ్యసభలో అడిగిన అన్స్టార్డ్ ప్రశ్నకు సమాధానం చెప్తూ, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) మండ్య జిల్లాలోని మర్లగల్ల ప్రాంతంలో 1,600 టన్నుల లిథియంను ప్రాథమిక సర్వేలో గుర్తించినట్లు తెలిపారు. లిథియం కోసం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో అన్వేషిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

