Viral Video : మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకలో పురోహితుడిది కీలక పాత్ర. వివాహ వేడుకలో కీలక పాత్ర పురోహితుడిదే. కొందరు పురోహితులు సందర్భానుసారం హాస్యం పండిస్తూ నవ్వులు పూయిస్తుంటారు. పెళ్లి సమయంలో ఆచారాల గురించి సరిగా అవగాహన లేని వధూవరులకు పురోహితుడు మార్గనిర్దేశనం చేస్తూ నవ్విస్తుంటాడు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
jaygogadecoration (జయగోగడెకరేషన్) అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. పురోహితుడు వధూవరులకు పలు సూచనలు ఇస్తాడు. ఈ క్రమంలో ఒకరి చేయి ఒకరు పట్టుకోవాలని వధూవరులకు సూచిస్తాడు. అయితే ఆ సూచన సరిగా అర్థం చేసుకోని వధువు.. వరుడి చేతికి బదులుగా పురోహితుడి చేతిని పట్టుకుంటుంది.
దాంతో పురోహితుడు నవ్వుతూ.. ‘పట్టుకోవాల్సింది నా చేయి కాదు, వరుడి చేయి’ అని సైగ చేస్తాడు. దాంతో వధువు సిగ్గుతో నవ్వుతుంది. ఆ తర్వాత వరుడి చేతిని పట్టుకుంటుంది. ఈ వీడియో లక్షల్లో వ్యూస్ దక్కించుకుంది. 16 వేల మందికి పైగా లైక్ చేశారు. నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి. ఆలస్యమెందుకు చూసి ఎంజాయ్ చేయండి..