Breaking news : ఆర్బీఐ (Reserve Bank of India) మాజీ గవర్నర్ (Ex Governor) శక్తికాంత దాస్ (Shaktikanta Das) కు మరో కీలక పదవి దక్కింది. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి ప్రిన్సిపల్ సెక్రెటరీగా (Principal Secretary) గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. శక్తికాంత దాస్ పదవీ కాలం నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నంత వరకు లేదంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏది ముందైతే అప్పటిదాకా ఉంటుందని కమిటీ తన నోటిఫికేషన్లో పేర్కొంది.
ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీగా శక్తికాంత దాస్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఆరేళ్లు పనిచేసిన ఆయనకు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్‌లో విశేష అనుభవం ఉంది. ఎకనామిక్స్, ఫైనాన్స్, మినరల్స్, రెవెన్యూ శాఖలతోపాటు జీ20 షెర్ఫా, ఏడీబీ (ADB) బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ వ్యవహారాలపై మంచి పట్టుంది. దాస్ నియామకంతోపాటు నీతి ఆయోగ్ (NITI Ayog) సీఈవో (CEO) బీవీఆర్ సుబ్రమణ్యం (BVR Subramanyam) పదవీకాలాన్ని కూడా ఒక ఏడాది పాటు పొడిగించారు.
బీవీఆర్ సుబ్రమణ్యం ప్రస్తుత పదవీకాలం 2025 ఫిబ్రవరి 24తో ముగియనుంది. తాజా పొడగింపువల్ల ఆయన 2026 ఫిబ్రవరి 24 వరకు పదవిలో కొనసాగనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన సుబ్రమణ్యం 1987 బ్యాచ్‌కు చెందిన వారు. రెండేళ్ల పదవీకాలానికి ఆయనను 2023 ఫిబ్రవరిలో నీతి ఆయోగ్ సీఈవోగా నియమించారు. సోమవారంతో ఆ గడువు ముగియనుండటంతో మరో ఏడాదిపాటు పొడిగించారు.