న్యూఢిల్లీ: తన ఇంటిని తానే నిర్మించుకోగల అరుదైన, సరికొత్త కప్ప జాతిని అరుణాచల్ ప్రదేశ్‌లో సైంటిస్టులు కనుగొన్నారు. ఇక్కడి నామ్దఫా టైగర్ రిజర్వ్‌లో ‘లిమ్నోనెక్టెస్ మోతీజీల్’ అనే అరుదైన, కోరలున్న కప్పను గుర్తించారు. ఈ జాతి కప్పలు భూమి లోపల గూళ్లు కట్టుకుంటాయి. ఇది ఈ ప్రాంతంలోని ఉభయచరాల వైవిధ్యాన్ని, పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నది. గూడు కట్టుకొని దాంట్లో నివసించటమన్నది కప్పల్లో అరుదైన, సరికొత్త విషయంగా సైంటిస్టులు పేర్కొంటున్నారు.