భోపాల్: బీజేపీ నేత మురళీధర రావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు, వైశ్యులు తన రెండు జేబుల్లో ఉన్నారని అన్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కులాల పేరుతో ఎందుకు ఓట్లు అడుగుతుందో అన్నది వివరించారు. బీజేపీలో బ్రాహ్మణ కార్మికులు ఉన్నప్పుడు బ్రాహ్మణుల పార్టీ అని, బనియా (వైశ్య) కార్మికులు ఉన్నప్పుడు బనియాల పార్టీ అని పిలిచేవారని మురళీధర రావు తెలిపారు. బీజేపీ అందరికీ అండగా ఉంటుందని అన్నారు.