భోపాల్: అశ్లీల వీడియోలు చూసిన బాలుడు తన చెల్లిపై అత్యాచార్యానికి పాల్పడ్డాడు. తండ్రికి ఈ విషయం చెబుతానని ఆమె బెదిరించడంతో గొంతు నొక్కి హత్య చేశాడు. (Boy Rapes, Kills Sister) ఆ బాలిక హత్యను కప్పిపుచ్చేందుకు తల్లి, ఇద్దరు అక్కలు కూడా ప్రయత్నించారు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు వారిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 24న ఒక ఇంటి ప్రాంగణంలో నిద్రించిన 9 ఏళ్ల బాలిక మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. విష కీటకం కుట్టడం వల్ల ఆ బాలిక చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.
కాగా, బాలికపై అత్యాచారం జరిగిందని, ఆమె గొంతు నొక్కి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులతో సహా సుమారు 50 మందిని పోలీసులు ప్రశ్నించారు. రాత్రి వేళ ఆ ఇంటి లోపలకు ఎవరూ వచ్చే అవకావం లేదని నిర్ధారించారు. కుటుంబ సభ్యులు మాట మార్చడంతో వారిపై అనుమానం వ్యక్తం చేశారు. చివరకు గట్టిగా ప్రశ్నించగా జరిగిన విషయాన్ని పోలీసులకు వారు చెప్పారు.
మరోవైపు అశ్లీల వీడియోల ప్రభావంతో 13 ఏళ్ల అన్న నిద్రిస్తున్న 9 ఏళ్ల చెల్లిపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని ఆమె బెదిరించడంతో గొంతు నొక్కి హత్య చేశాడని చెప్పారు. అనంతరం ఆ బాలుడు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాడని అన్నారు.
కాగా, బాలుడి తల్లితో పాటు 17, 18 ఏళ్ల వయస్సున్న అక్కలు కూడా అతడి తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో నిందితుడైన ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అతడి తల్లి, ఇద్దరు అక్కలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.