భారతదేశంలో ప్రతిభకు కొరత లేదు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ వైరల్ అవుతున్న అనేక వీడియోలే దీనికి నిదర్శనం. తాజాగా, రైల్వే స్టేషన్లో ఓ బాలుడు బ్యాక్‌ఫ్లిప్ స్టంట్స్ వేసి ఔరా అనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినవారంతా సూపర్ బ్రో అంటూ అతడిని ఎంకరేజ్ చేస్తున్నారు.
ఈ వీడియోను ఇన్‌స్టాలో సూరజ్‌సింగ్ అనే కంటెంట్ క్రియేటర్ షేర్ చేశారు. ఈ వీడియోలో బాలుడు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై బ్యాక్‌ఫ్లిప్‌లను ప్రదర్శిస్తూ అద్భుతమైన స్టంట్ చేస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో రైలు ఆగి ఉంది. అందులోని ప్రయాణికులు ఈ స్టంట్స్‌ను ఉత్కంఠగా చూస్తున్నారు. ఓ రైల్వే పోలీసు ఆ బాలుడి వెనుక నుంచి ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 3లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం.