జైపూర్: రెండు వందల అడుగుల లోతున్న ఓ బోరుబావిలో పడ్డ 9 ఏండ్ల బాలుడ్ని ఏడు గంటలపాటు శ్రమించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించాయి. ఉదయ్‌పూర్‌కు చెందిన బాలుడు అక్షిత్ శనివారం ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోగా, తమ సిబ్బంది బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని విపత్తు నియంత్రణ అధికారి ఒకరు తెలిపారు. వైద్యచికిత్స నిమిత్తం బాలుడ్ని హాస్పిటల్‌కు తరలించగా, అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.