న్యూఢిల్లీ : పెండ్లి వేడుకలో అంకుల్ సంజీవ్ శ్రీవాస్తవ ఆప్ కే ఆజానేసే సాంగ్‌కు క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్‌తో రాత్రికి రాత్రి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన విషయం నెటిజన్లకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఓ బాలుడు గోవింద మూవీ ఖుదాగజ్లోని అదే పాటకు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మెహందీ ఫంక్షన్లో బాలుడు ఈ బాలీవుడ్ ఓల్డ్ సాంగ్‌కు తన స్టెప్స్‌తో అదరగొట్టాడు.
ధోతి, కుర్తాతో ఆప్కీ ఆజానేసే సాంగ్‌కు హుషారైన మూమెంట్స్‌తో బాలుడు ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ చేస్తూ బాలుడు కింద పడిపోవడంతో అతడి తల్లి చేయందించి పైకి లేపడం వీడియోలో కనిపిస్తుంది. ఆపై బాలుడు ఏమాత్రం తడబాటు లేకుండా డ్యాన్స్ పెర్ఫామెన్స్ కొనసాగించడం అతడి తల్లి కూడా జాయినవడం నెటిజన్లను ఆకట్టుకుంది.
వారు తమ సూపర్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌ను చిరునవ్వుతో కొనసాగించిన తీరుకు యూజర్లు ఫిదా అయ్యారు. ఈ వీడియో కేవలం వినోదమే కాదు గొప్ప సందేశాన్నీ పంచుతుందని నెటిజన్లు కామెంట్ చేశారు. తల్లీ కొడుకులు డ్యాన్స్‌తో దుమ్ము రేపారని పలువురు యూజర్లు రాసుకొచ్చారు.