మీరు నువ్వు నాకు నచ్చావు సినిమా చూశారా. అందులో బ్రహ్మానందం రోలర్ కోస్టర్ ఎక్కి ఎలా భయపడ్డాడో తెలుసు కదా. అది మనకు ఎంతో నవ్వు తెప్పించింది. నిజానికి.. అది రియల్ కాకపోయినా బ్రహ్మానందం ఏడుపు, భయాన్ని చూసి తెగ నవ్వుకున్నాం. తాజాగా ఓ బాలుడు జెయింట్ వీల్ ఎక్కి ఇలాగే రచ్చ రచ్చ చేశాడు. ముందు కాస్త హుషారుగా ఉన్నప్పటికీ.. తర్వాత మాత్రం ఆపండ్రా బాబు అంటూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని ఓ మేళాలో జెయింట్ వీల్ ఎక్కిన బాలుడు ముందు కాస్త హుషారుగానే కనిపించాడు. ఆ తర్వాత ఏమైందో కానీ.. భయపడటం స్టార్ట్ చేశాడు. ఏడుపులోనే జై మహారాష్ట్ర, హర్ హర్ మహాదేవ్.. జై బజ్రంగ్ దళ్ అంటూ అరిచేశాడు. ఆ తర్వాత పాపా, ముమ్మా, కాకా, కాకి.. అంటూ ఆ బాలుడు ఏడ్చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. బాలుడు ఏడ్చినా కూడా భలే నవ్వు తెప్పించాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. జెయింట్ వీల్ ఎక్కి పెద్దలే భయపడతారు. పిల్లలు భయపడటంలో తప్పేముంది అని మరికొందరు కామెంట్లు చేశారు.