లక్నో: ఒక బాలుడు లిఫ్ట్‌లో ఉన్నాడు. ఒక మహిళ తన పెంపుడు కుక్కతో లిఫ్ట్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్కను చూసి ఆ బాలుడు భయపడ్డాడు. దానిని లిఫ్ట్‌లోకి తీసుకురావద్దని ఆ మహిళను ప్రాధేయపడ్డాడు. ఆగ్రహించిన ఆమె ఆ బాలుడ్ని లిఫ్ట్ నుంచి బయటకు తోయడంతోపాటు కొట్టింది. (woman assaulted boy) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 19న సాయంత్రం వేళ ట్యూషన్ నుంచి తిరిగివచ్చిన 8 ఏళ్ల బాలుడు గౌర్ సిటీ 2 అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని లిఫ్ట్ ఎక్కాడు. ఒక మహిళ తన పెంపుడు కుక్కతో లిఫ్ట్ ఎక్కేందుకు అక్కడకు వచ్చింది.
కాగా, కుక్కను చూసి ఆ బాలుడు భయపడ్డాడు. దానిని లిఫ్ట్‌లోకి తీసుకురావద్దని ఆ మహిళతో చెప్పాడు. ఆగ్రహించిన ఆ మహిళ అతడ్ని లిఫ్ట్ నుంచి బయటకు తోసింది. అతడ్ని కొట్టింది. లిఫ్ట్ డోర్ తెరుచుకోగా ఆ బాలుడు పరుగున లిఫ్ట్‌లోకి చేరుకున్నాడు. ఆ మహిళ అతడ్ని అనుసరించగా లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యింది. లోపలున్న బాలుడు భయంతో వణికిపోయాడు. జరిగిన విషయాన్ని తన పేరెంట్స్‌కు చెప్పాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ నివాసితులు అక్కడ నిరసన చేపట్టారు. ఆ మహిళ, ఆమె పెంపుడు కుక్క వల్ల చాలా మందితో గొడవ జరిగినట్లు ఆరోపించారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళను అరెస్ట్ చేశారు. బాలుడిపై ఆమె దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Another month, another dog drama. Noida’s societies never disappoint!
Minor in lift. Door opens. He sees a woman with a dog. Fear grips him. Hands folded, he pleads not to bring the dog in. Woman gets angry. Thrashes the boy. Boy escapes, runs back into the lift, visibly shaken… pic.twitter.com/siLMJzfsnw
— THE SKIN DOCTOR (@theskindoctor13) February 20, 2025