Boris Jhonson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జాతికి క్షమాపణలు చెప్పారు. 2020లో దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్నా డౌనింగ్ స్ట్రీట్ గార్డెన్లో జరిగిన ఓ పార్టీలో జాన్సన్ పాల్గొన్నారు. కోవిడ్ రూల్స్ నిబంధనలు అమలులో ఉన్నా, అత్యున్నత పదవిలో ఉన్న నేత ఎలా హాజరువుతారని, సిగ్గనిపించడం లేదా? అంటూ ప్రతిపక్షాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్ వేదికగా జాతి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 మే మాసంలో ఉద్యోగులకు ఓ పార్టీ ఇచ్చా. ఇలా కరోనా సమయంలో ప్రభుత్వం పక్షాన పార్టీ ఇవ్వడం ఏమాత్రం సరైన విధానం కాదని, మనస్ఫూర్తిగా తాను క్షమాపణలు చెబుతున్నానని జాన్సన్ పేర్కొన్నారు.
కరోనా నియమ నిబంధనలను జాన్సన్, పార్టీకి హాజరైన వారు ఉల్లంఘించారని, ఒకే చోట గుమిగూడద్దొన్న విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించారని అటు ప్రజలు, ఇటు పార్టీలు ఆయనపై తీవ్రంగా మండిపడ్డాయి. అంతేకాకుండా ఆయన పార్టీకి చెందిన వారే ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్లు లేవదీశారు. అయితే డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన పార్టీలో తాను కూడా పాల్గొన్నట్లు ప్రధాని బోరిక్ జాన్సన్ మొదటి సారిగా అంగీకరించారు. అయితే ఈ పార్టీలో పనిలో భాగమేనని వాదిస్తున్నారు. తాను అసలు కోవిడ్ రూల్స్ ఉల్లంఘించలేదని వాదిస్తూ వచ్చారు. చివరికి జాతికి క్షమాపణలు చెప్పారు.