Narendra Modi | కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్లకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు ఇస్తామని తెలిపారు. శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ 2022 జనవరి 10 నుంచి హెల్త్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇస్తామని ప్రకటించారు.