Pragya Thakur | ముంబై, మార్చి 25: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఇంకా ఎంపీగా కొనసాగడం తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నదని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. ఒకప్పుడు ప్రతిపక్ష నేతలను అనర్హులుగా ప్రకటించే వార్తలు రష్యా, టర్కీ నుంచి వచ్చేవని, ఇవాళ భారత్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, దాని వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య తల్లి సొంత బిడ్డను చంపుతున్నదని విమర్శించారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్సభ అనర్హత వేటు నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది.