Salman Khan | ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపు సందేశం వచ్చిందని ముంబై పోలీసులు మంగళవారం తెలిపారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకున్న ఓ వ్యక్తి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. ‘సల్మాన్‌ఖాన్ బతికి ఉండాలనుకొంటే, అతడు మా(బిష్ణోయ్ వర్గం) గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి లేదా రూ.5 కోట్లు చెల్లించాలి. అలా చేయకుంటే, మేం అతడిని చంపేస్తాం’ అని సందేశంలో ఉంది.
ఉత్తరకొరియా బలగాలతో ఉక్రెయిన్ సైన్యం ఢీ
కీవ్, నవంబర్ 5: రష్యాకు మద్దతుగా యుద్ధ రంగంలోకి దిగిన ఉత్తర కొరియా సైనిక బలగాలతో తమ సైన్యం తొలిసారి తలపడిందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఉమెరోవ్ మంగళవారం ప్రకటించారు. ఒక్కొక్కటి 3 వేల మంది సైనికులతో కూడిన ఐదు ఉత్తరకొరియా సైనిక యూనిట్లను రష్యా ప్రభుత్వం కుర్స్ సరిహద్దులో మోహరించిందని ఉమెరోవ్ చెప్పారు. కుర్స్లో ఉత్తర కొరియా సైన్యం పైకి ఫిరంగి కాల్పులతో ఉక్రెయిన్ ఆర్మీ విరుచుకుపడిందని కీవ్ అధికారి ఒకరు తెలిపారు.