లక్నో: బీజేపీ స్టిక్కర్ ఉన్న వాహనం ఒక బైక్‌ను ఢీకొట్టింది. వాహనం ముందు భాగంలో చిక్కుకున్న ఆ బైక్‌ను రెండు కిలోమీటర్ల వరకు అది ఈడ్చుకెళ్లింది. (Bolero With BJP Sticker Hits Bike) దీంతో రోడ్డుపై రాపిడికి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. తీవ్రంగా గాయపడిన బైకర్ మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొరాదాబాద్‌లోని షాజాద్ఖేరా గ్రామానికి చెందిన సుఖ్బీర్ ఆదివారం సాయంత్రం బస్లా గ్రామంలోని అత్తమామల ఇంటి నుంచి బైక్‌పై తిరిగి వెళ్తున్నాడు. సంభాల్ జిల్లా సదర్ కొత్వాలి పరిధిలోని అస్మోలి బైపాస్‌లో వేగంగా వెళ్తున్న బొలెరో అతడి బైక్‌ను ఢీకొట్టింది. వాహనం కింద చిక్కుకున్న ఆ బైక్‌ను వాజిద్పురం సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. దీంతో రోడ్డుపై బైక్ రాపిడికి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుఖ్బీర్ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం అతడు మరణించాడు.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ స్టిక్కర్తోపాటు ‘గ్రామ ప్రధాన్’ అని ఉన్న ఆ వాహనం స్థానిక గ్రామ సర్పంచ్‌కు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, మరో వాహనంలోని వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
संभल
बोलेरो ने बाइक को 2 KM घसीटा, हाइवे पर निकलती रही चिंगारी…घटना का लाइव विडियों आया सामने #Sambhal pic.twitter.com/Sz9Qw1PQLD— Utkarsh Singh (@utkarshs88) December 30, 2024