న్యూ ఢిల్లీ : బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణంలో లంచాలపై స్విట్జర్లాండ్ నుంచి పెట్టెలో వచ్చిన సాక్ష్యాలను బయటపెట్టాలని సీబీఐని సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి చిత్ర సుబ్రహ్మణ్యం కోరారు. ఈ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించినట్లు మాజీ సీబీఐ అధికారులు తెలిపారు. ‘బోఫోర్స్ గేట్ : ఏ జర్నలిస్ట్స్ పర్స్యూట్ ఆఫ్ ట్రూత్’ అనే పుస్తకాన్ని ఇటీవల చిత్ర రాశారు. కుంభకోణం గురించి దీనిలో వివరించారు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన సాక్ష్యాలతో కూడిన పెట్టెను ఎవరు తెరిచారు? ఆ పెట్టెల్లో ఏమి ఉంది? తమకు చెప్పాలని ఆమె ఆ పుస్తకంలో డిమాండ్ చేశారు.