అంకారా: తుర్కియే హోటల్ శిథిలాల నుంచి ఒక భారతీయుడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడ్ని విజయ్ కుమార్‌గా గుర్తించారు. వ్యాపారవేత్త అయిన ఆయన బిజినెస్ టూర్ కోసం ఇటీవల ఆ దేశానికి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తుర్కియే, సిరియా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. విజయ్ కుమార్ బస చేసిన మాలత్యాలోని ఓ హోటల్ కూడా కూలిపోయింది. నాటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. విజయ్ కుమార్ మృతదేహాన్ని ఆ హోటల్ శిథిలాల నుంచి శనివారం వెలికితీశారు. తుర్కియేలోని భారత రాయబార కార్యాలయం శనివారం ఈ విషయం తెలిపింది. ఆ దేశంలో సంభవించిన భూపంకంలో భారత్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ విజయ్ కుమార్ మరణించినట్లు ట్వీట్ చేసింది. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపింది. విజయ్ కుమార్ మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
కాగా, ఈ నెల 6న తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 25,000 దాటింది. ప్రకృతి విలయం జరిగి ఐదు రోజులైనప్పటికీ శిథిలాల్లో చిక్కుకున్న కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. భూకంపం సంభవించిన 129 గంటల తర్వాత తుర్కియేలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శిథిలాల నుంచి సజీవంగా బయటపడ్డారు.
Our deepest condolences to his family and loved ones. We are making arrangements for the earliest possible transportation of his mortal remains to his family.@PMOIndia @DrSJaishankar @MEAIndia
2/2— India in Türkiye (@IndianEmbassyTR) February 11, 2023