ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన మహాకుంభ్‌లో బోటులు నడిపే ఓ కుటుంబం 30 కోట్లు సంపాదించినట్లు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో వెల్లడించిన విషయం తెలిసిందే. బోట్‌మ్యాన్ పింటూ మహ్రా కుటుంబం త్రివేణి సంగమం వద్ద కుంభమేళా సమయంలో 45 రోజుల పాటు సుమారు 130 బోట్లు నడిపారు. అరైల్ గ్రామానికి చెందిన ఆ ఫ్యామిలీ.. 45 రోజుల్లోనే 30 కోట్లు ఆర్జించింది. అయితే ఆ కుటుంబానికి ఆదాయపన్ను శాఖ ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. ఇన్‌కం ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం రూ.12.8 కోట్లు పన్ను చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
బోట్‌మ్యాన్ పింటూ మహ్రా కుటుంబం ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసుతో షాక్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ నోటీసులపై ఫైనాన్షియల్ ప్లానర్, సెబీ రీసర్చ్ అనలిస్ట్ ఏకే మంధన్ స్పందించారు. బోట్‌మ్యాన్ పింటూ డబ్బు సంపాదించినా.. ఆయనకు సుఖం లేకుండా పోయిందన్నారు. కుంభమేళాలో రద్దీ వల్ల ఒక్కొక్క రైడ్‌పై వెయ్యి వసూల్ చేసి.. ఆ డబ్బును సంపాదించారని, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ ఫ్యామిలీకి షాక్ ఇచ్చినట్లు తన పోస్టులో పేర్కొన్నారు.
ఆదాయ పన్ను శాఖ 1961 ఐటీచట్టంలోని సెక్షన్ 4, 68 కింద నోటీసు ఇచ్చిందని, రూ.12.8 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని పేర్కొన్నదన్నారు. ట్యాక్స్ శ్లాబ్‌లు తెలియని వ్యక్తి .. ఇప్పుడు భారీ ట్యాక్స్ కట్టాల్సి వస్తోందన్నారు. డబ్బు సంపాదించినా.. అదో పీడకలగా మారిందన్నారు. ఒకప్పుడు నెలలో 15వేల సంపాదించేందుకు కష్టపడేవాళ్లని, ఇప్పుడు ఒకే ఏడాదిలో 12.8 కోట్ల పన్ను కట్టాల్సి వస్తుందన్నారు.
₹30 CRORE EARNING – ₹12.8 CRORE TAX!
A boatman from Prayagraj, who spent his entire life rowing boats and earning barely ₹500 a day, suddenly found himself making a massive ₹30 crore during the Mahakumbh Mela.
The huge crowd of pilgrims created an unexpected demand, and the…
— A K Mandhan (@A_K_Mandhan) March 12, 2025