Viral Video | బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ చోరీ జరిగింది. పార్కింగ్ చేసిన బీఎండబ్ల్యూ కారులో నుంచి రూ. 13.75 లక్షలను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు అపహరించారు. ఈ చోరీ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
రూ. కోటి విలువ చేసే బీఎండబ్ల్యూ ఎక్స్5 అనే కారును సోంపురలోని సబ్ రిజిస్ట్రార్ వద్ద పార్కింగ్‌లో నిలిపారు. అయితే బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో, ఒకరు డ్రైవర్ వైపు ఉండే కారు అద్దాలను పగులగొట్టాడు. క్షణాల్లోనే కారులోకి వంగి.. ఓ కవర్‌ను అపహరించారు. అనంతరం బైక్‌పై ఇద్దరు దుండగులు పరారీ అయ్యారు.
కారు యజమాని వచ్చి చూడగా, క్యాష్ కవర్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించారు. బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించాడు. కారులో ఉన్న రూ. 13.75 లక్షలను ఎత్తుకెళ్లారని బాధితుడు పోలీసులకు తెలిపారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
BMW Window broken by 2 men to rob Rs 13.75 lakh cash near sub-registrar’s office in Sompura, Sarjapur. pic.twitter.com/zY8oXrXfSO
— Harsh (@Edsh4rsh) October 22, 2023