భోపాల్: కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన విధేయులకు టిక్కెట్లు ఇప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు.
సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సింధియాకు విభేదాలు ఉండటంతో ఆయన విధేయులకు టిక్కెట్ల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని మొదట్నుంచి ప్రచారం జరిగింది. అయితే శివరాజ్‌ను పెద్దగా పట్టించుకోని బీజేపీ కేంద్ర నాయకత్వం సింధియా విధేయులు ప్రస్తుత క్యాబినెట్లో ఉన్న ఏడుగురు మంత్రులకు టికెట్లు కేటాయించింది. సింధియా వెంట బీజేపీలో చేరిన అనేకమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరడంతో మిగిలిన వారిని కాపాడుకోవడం కోసం టికెట్లు ఇచ్చినట్టు తెలుస్తున్నది.