శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా(Devyani Rana) ముందంజలో ఉన్నారు. ఆ రాష్ట్రంలోని నగ్రోటా స్థానం నుంచి ఆమె పోటీ చేశారు. తాజా సమాచారం ప్రకారం సుమారు 5 వేల ఓట్ల తేడాతో ఆమె ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీన్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్‌పై దేవయాని ఆధిక్యంలో కొనసాగుతున్నది. మూడవ రౌండ్ ముగిసే లోగా జమ్మూలోని నగ్రోటా సీటు నుంచి బీజేపీ అభ్యర్థి ముందంలో ఉన్నది. అప్పటి వరకు దేవయానికి 11 వేలు, జేకేఎన్‌పీపీ అభ్యర్థికి 4వేల ఓట్లు పోలయ్యాయి. మూడవ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి షమీమ్ బేగం రెండు వేల ఓట్లతో కొనసాగుతున్నారు.
నగ్రోటా బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ రాణా మృతిచెందడంతో ఆయన కుమార్తె దేవయాని రాణా ఆ స్థానం నుంచి పోటీలోకి దిగారు. అయితే ఆరంభం నుంచే ఆమె లీడింగ్‌లో ఉన్నారు. నవంబర్ 11వ తేదీన ఆ నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది. ఆ నియోజకవర్గంలో దాదాపు 75 శాతం ఓటింగ్ జరిగింది.