శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 19:43:49

కౌంటింగ్‌ నేపథ్యంలో స్వీట్లు తయారీలో బీజేపీ

కౌంటింగ్‌ నేపథ్యంలో స్వీట్లు తయారీలో బీజేపీ

పాట్నా: ఇటీవల ముగిసిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం జరుగనున్నది. ఓట్లను లెక్కించిన అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో మిఠాయిల తయారీలో బీజేపీ బిజీ అయ్యింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ నేతృత్వంలోని మహాకూటమి అధిక స్థానాల్లో గెలుస్తుందని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. దీంతో జేడీయూ-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బీహార్‌లో అధికారం కోల్పోవచ్చని తెలుస్తున్నది. అయినప్పటికీ గెలుపుపై బీజేపీలో ఏమాత్రం ధీమా సడలలేదు. మంగళవారం నాటి కౌంటింగ్‌, ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో పాట్నా సాహిబ్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు లడ్డూల తయారీలో నిమగ్నమయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.