Shobha Karandlaje | కేంద్ర మంత్రి కారు ఢీకొట్టడంతో.. బస్సు కింద పడి బీజేపీ కార్యకర్త మృతి
Shobha Karandlaje | కేంద్ర మంత్రి కారు డోర్‌ను ఢీకొట్టిన బీజేపీ కార్యకర్త బస్సు కింద పడి మరణించాడు. దీంతో కేంద్ర మంత్రి కారు డ్రైవర్, బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.
బెంగళూరు: కేంద్ర మంత్రి కారు డోర్‌ను ఢీకొట్టిన బీజేపీ కార్యకర్త బస్సు కింద పడి మరణించాడు. దీంతో కేంద్ర మంత్రి కారు డ్రైవర్, బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) బెంగళూరు నార్త్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం కేఆర్ పురం ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.
కాగా, కేంద్ర మంత్రి శోభా కారు రోడ్డు పక్కగా నిలిచి ఉండగా డ్రైవర్ చూసుకోకుండా డోర్ తెరిచాడు. స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ కార్యకర్త అయిన 63 ఏళ్ల ప్రకాష్, ఆ కారు డోర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడ్డాడు. అటుగా వెళ్తున్న బస్సు కింద ఆయన పడటంతో అక్కడికక్కడే మరణించాడు.
మరోవైపు ఈ సంఘటన జరిగినప్పుడు కేంద్ర మంత్రి శోభా ఆ కారులో లేరని పోలీసులు తెలిపారు. ఆమె అక్కడ ప్రచారం కోసం కారు దిగి ర్యాలీగా వెళ్లారని చెప్పారు. ప్రకాష్ మృతికి కారణమైన కేంద్ర మంత్రి కారు డ్రైవర్, బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- BJP worker
- car
- crashing
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

