Gaumutra States: గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుంది: లోక్‌సభలో డీఎంకే ఎంపీ
Gaumutra states: గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని లోక్‌సభలో డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ విమర్శించారు. జమ్మూకశ్మీర్ బిల్లుపై చర్చిస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు అంటూ ఆయన విమర్శించారు. దక్షిణాదిలో ఆ పార్టీకి అవకాశం లేదన్నారు.
న్యూఢిల్లీ: డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ ఇవాళ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు(Gaumutra states)గా వర్ణించారు. జమ్మూకశ్మీర్ బిల్లులపై జరిగిన చర్చ సమయంలో ఆయన మాట్లాడుతూ.. హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు అంటూ విమర్శించారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుంది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గెలుపు ఉండదని అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని గుర్తుచేస్తూ కేవలం ఉత్తరాదిలోనే బీజేపీ గెలుస్తుందని, అవి గోమూత్ర రాష్ట్రాలని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోకి బీజేపీ రాలేదన్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కర్నాటకలో.. స్థానిక పార్టీలే బలంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
#WATCH | Winter Session of Parliament | DMK MP DNV Senthilkumar S says “…The people of this country should think that the power of this BJP is only winning elections mainly in the heartland states of Hindi, what we generally call the ‘Gaumutra’ states…” pic.twitter.com/i37gx9aXyI
— ANI (@ANI) December 5, 2023
ఎంపీ సెంథిల్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఖండించారు. సనాతన సంప్రదాయాన్ని అవమానించినట్లు ఆమె చెప్పారు. త్వరలోనే డీఎంకేకు గోమూత్ర లాభాలు ఏంటో తెలుస్తాయన్నారు. దేశ ప్రజలు ఇలాంటి ద్వేషుల్ని సహించరన్నారు. దేశ మనోభావాలతో ఆడుకోవాలనుకునే వాళ్లకు ప్రజలే బలమైన గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు.
#WATCH | Winter Session of Parliament | On ‘Gaumutra’ remark by DMK MP DNV Senthilkumar S, Union Minister Meenakashi Lekhi says “I think that is a disrespect of the ‘Sanatani’ tradition. DMK will soon get to know the benefits of ‘Gaumutra’. They are very well aware that this will… pic.twitter.com/Z7e7bvaTtu
— ANI (@ANI) December 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

