మంగళవారం 31 మార్చి 2020
National - Feb 23, 2020 , 01:08:17

రాజకీయాలను పక్కనపెట్టి ఆహ్వానిద్దాం

రాజకీయాలను పక్కనపెట్టి ఆహ్వానిద్దాం
  • కాంగ్రెస్‌కు బీజేపీ సూచన

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా రాజకీయాలు పక్కనపెట్టి సాదరంగా ఆహ్వానిద్దాం అని కాంగ్రెస్‌కు బీజేపీ సూచించింది. ‘ట్రంప్‌ భారత పర్యటన భారత-అమెరికా సంబంధాల్లో మైలురాయిగా నిలిచిపోనున్నది. దేశం సాధిస్తున్న విజయాలతో ప్రతిపక్షం కూడా గర్వించాలి. రాజకీయపార్టీలు తమ రాజకీయాలను పక్కనపెట్టి ఒకే దేశంగా ఆలోచించాల్సిన సందర్భమిది’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర కాంగ్రెస్‌కు సూచించారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాల మధ్య జరుగుతున్న భేటీని సంబురంగా జరుపుకోవాల్సిన సమయమిదని చెప్పారు. ఈ భేటీ దేశం స్థాయిని పెంచుతున్నప్పుడు ఎందుకు సంతోషంగా లేరో చెప్పాలంటూ కాంగ్రెస్‌ నేతలను ఆయన నిలదీశారు. logo
>>>>>>