చెన్నై, ఆగస్టు 31: దేశాన్ని నాశనం చేసిన బీజేపీ పాలన 2024 సార్వత్రిక ఎన్నికల్లో అంతం అవుతుందని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. భవిష్యత్తులో సోదరభావం, సమానత్వంతో కూడిన భారత్‌ను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. డీఎంకే పార్టీ స్థాపించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తమ గళాన్ని వినిపించాలి. స్పీకింగ్ ఫర్ ఇండియా పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. బీజేపీ హయాంలో దేశ తిరోగమనం పై నా గళాన్ని వినిపిస్తాను’ అని పేర్కొన్నారు.