గురుగ్రామ్, ఆగస్టు 5: రిసార్టు రాజకీయాలు అంతర్జాతీయ స్థాయికి వెళ్లాయి. అది కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. హర్యానా బీజేపీకి చెందిన కౌన్సిలర్లు దేశ సరిహద్దులు దాటి నేపాల్‌కు వెళుతున్నారు. మానేసర్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ డిప్యుటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు క్రాస్ ఓటింగ్ భయంతో బీజేపీ 12 మంది పార్టీ కౌన్సిలర్లను నేపాల్ తరలించింది. అంతకుముందు వీరు గోవా, గువాహటికి విహార యాత్రలు చేసొచ్చారు. గ్రూపు వైరాల కారణంగానే కౌన్సిలర్లతో రిసార్టు రాజకీయాలకు బీజేపీ తెరలేపినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు చెందిన వర్గం, కేంద్ర మంత్రి రావు ఇందర్జిత్ సింగ్‌కు చెందిన వర్గం మధ్య మానేసర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై పట్టుకోసం పోరాటం సాగుతున్నట్లు తెలిసింది.
మృతురాలి ఖాతాలోలక్ష కోట్లు జమ! ; షాక్ తిన్న కుమారుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు
గ్రేటర్ నోయిడా: చనిపోయిన తన తల్లి బ్యాంక్ ఖాతాలో రూ.1.13 లక్షల కోట్లకు పైగా జమ అయినట్టు గుర్తించిన గ్రేటర్ నోయిడాకు చెందిన దీపక్(19) అనే యువకుడు ఆశ్చర్యపోయాడు. తన తల్లి రెండు నెలల క్రితం చనిపోయిందని… అయినా ఆమె బ్యాంక్ ఖాతా ను తాను వాడుతున్నానని అతడు తెలిపాడు. ఆదివారం రాత్రి అతడికి తన తల్లి బ్యాంక్ ఖాతాలో రూ.1.13 లక్షల కోట్లు జమ అయినట్టు సందేశం వచ్చింది. దీంతో షాక్ తిన్న అతడు ఆ సందేశాన్ని నమ్మలేక అందులోని సున్నాలను లెక్కించమని తన స్నేహితులను కోరాడు. సోమవారం అతడు కొటక్ మహీ ంద్రా బ్యాంక్‌కు వెళ్లి విషయం తెలుపగా.. అధికారులు అది అసాధారణంగా జమ అయిన మొత్తమని ధ్రువీకరించారు. వెంటనే అతడి తల్లి బ్యాంక్ ఖాతాను స్తంభింపచేస్తున్నట్టు తెలిపారు. ఈ అసాధారణ జమకు బ్యాంకింగ్ తప్పిదం కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.