JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా (JP Nadda) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు చైర్మన్ ఆమోదం తెలిపినట్లు రాజ్యసభ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్లో పదవీకాలం ముగియనున్న 57 మంది రాజ్యసభ సభ్యుల్లో ఆయన ఒకరు. బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఆయనను గుజరాత్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ)కు ఎన్నికైన నడ్డా రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాజీనామాను చైర్మన్ ఆమోదించినట్లు రాజ్యసభ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.